ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బుధవారం సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. అలాగే ఆమదాలవలస పట్టణంలోని మోనింగ్ వారి వీధి లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు భాస్కర్ శర్మ , మోహన్ శర్మ, మనోహర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.