బూర్జ మండలం అయ్యవారిపేట పంచాయతీ పరిధి చోడవరపు సత్యనారాయణ, కటకమయ్యపేటకు చెందిన దేవరపల్లి బారికయ్య పిడుగుపాటుతో ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. పిడుగుపాటుకు మృతి చెందడం బాధాకరమని వైసీపీ రెబల్, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ అన్నారు. ఈ మేరకు శనివారం బాధిత కుటుంబ సభ్యుకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.