తోటాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

76చూసినవారు
ఆముదాలవలస మండలం తోటాడ గ్రామంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం పర్యటించారు. వంద రోజుల ప్రభుత్వ పాలనపై 'ఇది మంచి ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అక్కులపేట సెక్టార్ పరిధిలో పోషకాహార మాసోత్సవాలలో పాల్గొన్నారు. యువతరం పెంపొందాలి అంటే ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని. ఆ విధంగా జననాల శాతం పెరగాలని ఎమ్మెల్యే సూచించారు. చిన్నారుల పోషణ, చదువు వంటివి ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్