పొందూరు: గోదాములను పరిశీలించిన అధికారులు

65చూసినవారు
పొందూరు: గోదాములను పరిశీలించిన అధికారులు
పొందూరు మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలోని గిడ్డంగుల సంస్థ గోదాములో తనిఖీలు జరిగాయి. శుక్రవారం ఏపి వేర్ హౌజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గేదెల సురేశ్ కుమార్ ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాముల్లోని 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర ఆంధ్ర రీజనల్ మేనేజర్ రాజశ్రీ, పొందూరు మేనేజర్ సునీత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్