రాష్ట్రంలో పశు, మత్స్య సంపద పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయక చర్యలను చేపట్టాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు. సోమవారం నిర్వహించిన పార్లమెంటు సమావేశాల్లో అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పశు సంరక్షణ చాలా అవసరమైన విషయమని అన్నారు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 70 శాతం పైబడిన గ్రామీణ ప్రాంతం ఉండడం వలన పశు సంపదకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.