వైసిపి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువై, దాడులు జరిగిన ఘటనలు ఎన్నో చూశామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పలు సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కాలంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుని శిరస్సు ఖండన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. రాష్ట్రంలో గతంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడులకు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు.