విద్యార్థులచే కిరాణా సామాన్లు మోయిస్తున్న హాస్టల్ సిబ్బంది

69చూసినవారు
లావేరు మండలం మురపాక గ్రామంలోని స్థానిక బీసీ హాస్టల్ (బాలురు) విద్యార్థుల చేత ఆ హాస్టల్ సిబ్బంది కిరాణా, ఇతర సామాన్లు మోయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం విద్యార్థులు సామాన్లు మోస్తూ వర్షంలో వెళ్తుండగా. స్థానికులు వారిని ఆరా తీశారు. విద్యార్థులచే ప్రతిరోజు హాస్టల్ సిబ్బంది ఇటువంటి పనులు చేయిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించి, చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్