లావేరు: మురుగునీటిలో దిగి నిరసన.. స్పందించిన ఎమ్మెల్యే

82చూసినవారు
లావేరు మండలం బుడుమూరు గ్రామంలో కాలువల సమస్యపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు స్పందించారు. ఆ గ్రామానికి ఆదివారం వెళ్లి నిరసన చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. బుడుమూరు బీసీ కాలనీలో ఉన్న మురికి నీటి కాలువల సమస్యను మూడు నెలల లోపు ఎంత ఖర్చు అయినా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వస్తానని ఆందోళనకారులకు మాట ఇచ్చారు. కాగా సమస్యను పరిష్కరించాలని స్థానికులు మురుగు కాలువలో దిగి వినూత్నంగా నిరసన చేశారు.

సంబంధిత పోస్ట్