ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్ చేపట్టారు. 631 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 364 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హజరయ్యారు. వీరిలో 220 మంది అభ్యర్థులు క్వాలిఫైడ్ అయ్యారని ఎస్పీ స్పష్టం చేశారు.