ఉచిత ఇసుక హమీ విధానము అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 4న ధర్నాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు బుధవారం అన్నారు ఈ మేరకు సోంపేట లో నాయకులు తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పై ఇచ్చిన హామీను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.