సోంపేట: రైతులు అప్రమత్తంగా ఉండాలి

63చూసినవారు
అకాల వర్షంతో జిల్లా వ్యాప్తంగా రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. చేతికివచ్చిన పంటను కాపాడునుకునేందుకు సోంపేట, కంచిలి, బారువ, పలాసపురం, లక్కవరం గ్రామాల్లో రైతులు చర్యలు చేపట్టారు. రైతులు కోసిన వరిని కుప్పగా పెట్టి  కవర్లు కప్పి కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నూర్పిడైన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని..  రైతు సేవా కేంద్రం ప్రతినిధులు, తహశీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్