అమ్మవారి ఉత్సవాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ

53చూసినవారు
అమ్మవారి ఉత్సవాల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయ
కవిటి మండలంలోని వింధ్యగిరిలో జరుగుతున్న కొఠారి చండి అమ్మవారి ఉత్సవాల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమెతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్