జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంలో సోమవారం కార్తీకం ఆఖరి రోజు పోలి పాడ్యమి సందర్భంగా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పురోహితులకు సాలగ్రామ దానాలు చేశారు.