జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు సమీపంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రైల్వే ఎస్ఐ షరీఫ్ అందించిన సమాచారం మేరకు పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన కోర్ను శ్రీనివాసరావు (27) బుధవారం సాయంత్రం గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించామని ఎస్సై తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించామన్నారు.