జిల్లా ఎస్పీ కె. వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా నిర్వహించేందుకు గానూ చర్యలు చేపడుతున్నామని నరసన్నపేట సీఐ జె శ్రీనివాసరావు, ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో జాగిలంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బస్సులలోను, స్థానిక దుకాణాలలోనూ, ప్యాసింజర్ల వద్ద ఉన్న లగేజీలను తనిఖీ చేశామని వారు స్పష్టం చేశారు.