ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలలు విధిగా పాటించాలని వాహనాల మీద పరిమితి కి మించి ప్రయాణం చేయడం నేరమని అది ప్రమాదాలకు దారితీస్తుందని సారవకోట ఎస్సై బి. అనిల్ కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక బురుజువాడ గ్రామం వద్ద పలు ద్విచక్ర వాహనాలను ఆయన తనిఖీ చేశారు. త్రిబుల్ డ్రైవింగ్ చేసేవారికి ఫైన్ విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.