రైతులకు అండగా వైసీపీ చేపట్టబోయే ర్యాలీ పోస్టర్ ను పాలకొండలో బుధవారం మండల వైసీపీ కన్వీనర్ కనపాక సూర్య ప్రకాష్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆయన అన్నారు. రైతులకు అండగా ఈనెల 13న మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి నిరసన ర్యాలీ ఉంటుందన్నారు. వీరితో పాటు సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు తిర్లంగి ఉపేంద్రకుమార్, నల్లి శివప్రసాద్ పాల్గొన్నారు.