పలాస టీడీపీ కార్యాలయంలో గ్లో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపుమేరకు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి స్వచ్ఛందంగా యువతీ యువకులు పాల్గొన్నారు. తమవంతుగా రక్తాన్ని దానం చేసిన యువతకు ఎమ్మెల్యే శిరీష ప్రశంసా పత్రాలను అందించారు.