పాతపట్నం: నిత్యవసర ధరలు అదుపు చేయాలి: సిపిఎం

64చూసినవారు
పాతపట్నం: నిత్యవసర ధరలు అదుపు చేయాలి: సిపిఎం
రాష్ట్ర ప్రభుత్వం ధరలను అదుపు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల. ప్రసాద్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తూరులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, నిత్యవసరధరలు పెరిగి ప్రజానీకం పై తీవ్రమైన భారాలను వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మక. అప్పన్న, మోహనరావు, దుర్గారావు, గణపతి, తెల్లన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్