మెళియాపుట్టి మండలం శేఖరాపురంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ పనుల్లో భాగంగా గోశాలను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి, పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గోవులను సంరక్షించాలన్నారు. ఈ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.