మెళియాపుట్టి: మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన ఆర్డీవో

84చూసినవారు
మెలియాపుట్టి మండల కేంద్రంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మెనూ ప్రకారం విద్యార్థులకు తాజా ఆహరాన్ని వడ్డించాలన్నారు. అనంతరం 9, 10 తరగతుల విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎస్. దేవేందర్ రావు, ఎం. పద్మనాభరావు, హెచ్ఎం గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్