పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో క్రైమ్ నెం. 29/2020 కింద భౌతిక దాడి, అట్రాసిటీ కేసు నమోదయింది. ఈ మేరకు సోమవారం నిందితుడికి 2 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ శ్రీకాకుళం 4వ అదనపు జిల్లా కోర్టు జడ్జి తీర్పును ప్రకటించారు. ఈ మేరకు ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పాతపట్నం పోలీస్ ను జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అభినందించారు.