విజయవాడ ఇందిర గాంధీ స్టేడియంలో జరగబోయే విజన్ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం సాయంత్రం బయలుదేరారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న విజన్ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.