పెద్దమల్లిపురంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు

73చూసినవారు
పెద్దమల్లిపురంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు
పాతపట్నంలో సూర్యుడి ప్రతాపంతో పాటు ఎన్నికల హీట్ కూడా పెరిగింది. దాంతో బందోబస్తు కోసం పాతపట్నానికి కేంద్ర అదనపు బలగాలు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం కేంద్ర బలగాలతో పాతపట్నం సీఐ ఎన్ సాయి, ఎస్ఐ మహమ్మద్ యాసిన్ పెద్దమల్లిపురం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు భయభ్రాంతులకు గురి కాకుండా నిర్భయంగా ఓటు వేయాలని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్