టీడీపీ నాయకుడు కోలా శ్రీనివాస్ దేవ్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే గోండు శంకరరావు తెలిపారు. బుధవారం మృతిడి ఇంటికి వెళ్లి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వివరించారు. అనంతరం మానవత్వం చాటుకుని ఆయన పాడె మోసి అంత్య క్రియల్లో పాల్గొన్నారు.