అందరి సంక్షేమం కోరే ప్రభుత్వం తమది అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం, బందరువానిపేటలో రామ మందిరం నిర్మాణానికి టీటీడీ బోర్డ్ (శ్రీవాణి ట్రస్ట్ ) నుంచి పది లక్షల రూపాయల చెక్కును సంబంధిత గ్రామస్థులకు పెద్దపాడు క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచేస్తున్నాడు అని విపక్షాలు చేస్తున్న ప్రచారాలు మానుకోవాలన్నారు.