కోటబొమ్మాలి: "ఫిబ్రవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలి"

69చూసినవారు
కోటబొమ్మాలి: "ఫిబ్రవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలి"
పారా లీగల్ వాలంటీర్లుగా శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోటబొమ్మాలి జూనియర్ సివిల్ జడ్జి బి. ఎమ్. ఆర్. ప్రసన్నలత తెలిపారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, జలుమూరు మండలాల పరిధిలో అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండల న్యాయ సేవా సంఘంకి ఫిబ్రవరి 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం సూచించారు. దరఖాస్తుదారులకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్