ఎంపీ అభ్యర్థి తిలక్ కు వివేకానంద సంఘం మద్దతు

74చూసినవారు
ఎంపీ అభ్యర్థి తిలక్ కు వివేకానంద సంఘం మద్దతు
శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కి పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన సాగర వివేకానంద సంఘం సభ్యులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు నందిగాం మండలంలోని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఎంపీ అభ్యర్ధి పేరాడ తిలక్ ని కలిసి తమ మద్దతు తెలిపారు. ఈకార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పి. తిరుపతిరావు, డి. లక్ష్మణయ్య, ఎస్. వేణు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్