టెక్కలి, పాతపట్నం, కొత్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 21 అంగన్వాడీ మినీ కార్యకర్తలు, హెల్పర్ల ఖాళీల భర్తీకి గాను మంగళవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేరకు టెక్కలి ఆర్డీఓ ఎన్. కృష్ణమూర్తి, జిల్లా ఐసీడీఎస్ పీడీ బీ. శాంతిశ్రీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.