విద్యుత్ షాక్ తో మహిళకు తీవ్ర గాయాలు

79చూసినవారు
విద్యుత్ షాక్ తో మహిళకు తీవ్ర గాయాలు
టెక్కలి మండల కేంద్రం లోని టెక్కలి- మెలియాపుట్టి రోడ్డు లోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షాక్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్