SRH vs GT మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన పోలీస్ భద్రత కల్పించారు. 2700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అనుమతి లేని వస్తువులు, కెమెరా వంటి రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ ఇయర్ఫోన్స్, సిగరెట్స్, అగ్గిపెట్టె, లైటర్, అయుధాలు తీసుకెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు. వీటితో పాటు కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, తినుబండారాలు లోనికి అనుమతి లేదని, ల్యాప్టాప్, సెల్ఫీ స్టిక్స్ అనుమతి లేదని పేర్కొన్నారు.