త్వరలో 'బుడమేరు' మరమ్మతులకు టెండర్లు: మంత్రి నిమ్మల

83చూసినవారు
త్వరలో 'బుడమేరు' మరమ్మతులకు టెండర్లు: మంత్రి నిమ్మల
ఏపీలోని విజయవాడ వాసులకు మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. గతేడాది భారీ వర్షాలు కారణంగా విజయవాడను ముంచెత్తిన 'బుడమేరు’ మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వెలగలేరు నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యం పెంపు, దానికి సమాంతరంగా కొత్త ఛానెల్ అభివృద్ధిపై ద్రుష్టి పెట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్