కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్

55చూసినవారు
కొడుకును కాల్చి చంపిన కానిస్టేబుల్
ఓ కానిస్టేబుల్ క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చేసిన ఘటన ఒంగోలులో జరిగింది. ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు శేష్ కమల్ (20) నిన్న రాత్రి తండ్రిని బైక్‌పై తీసుకెళ్లి గోడౌన్‌ వద్ద వదిలాడు. అనంతరం జీతం డబ్బుల్లో నుంచి రూ.20 వేలు ఇవ్వాలని కొడుకు అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ తుపాకీతో కాల్చడంతో కొడుకు స్పాట్‌లోనే మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్