2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: అచ్చెన్న

64చూసినవారు
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: అచ్చెన్న
AP: రాష్ట్రాభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్