AP: వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86 శాతంగా నమోదైందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం 2024-25లో రూ.13.09 కోట్లతో 4.30 లక్షల భూసార పరీక్షల పత్రాలను రైతులకు అందించిందన్నారు. 2025-26లో 6 లక్షల భూసార పరీక్షల పత్రాలు రైతులకు అందించేందుకు లక్ష్యం పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.