AP: "ఎన్నికల ఫలితాల్లో
టీడీపీ-జనసేన-
బీజేపీ కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయి.. కూటమిదే సీఎం పీఠం. కాదు వైఎస్ జగనే మళ్లీ సీఎం అవుతారు.. కావాలంటే రూ.లక్ష పందెం కాస్కో." ఇదీ తూ.గో జిల్లాలోని ఓ రైతు బజారు వద్ద హడావుడి. క్రికెట్ బెట్టింగులను మించి అయిదేళ్లకోసారి వచ్చే సార్వత్రిక ఫలితాలపై రాష్ట్రంలో పందేల జోరు గట్టిగా కనిపిస్తోంది. పేదోడు నుంచి కోటీశ్వరుడి వరకు తమ అభిమాన నాయకులు, పార్టీపైన పందేలు కడుతున్నారు.