AP: రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సభలో పవన్ మాట్లాడుతూ.. ‘ప్రజలు మమ్మల్ని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారు. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు మేం చేయగలం. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. గత ప్రభుత్వం అధికారులను చాలా ఇబ్బంది పెట్టింది. రాళ్లు, రప్పల మధ్య నగరాన్ని చూడగలిగిన దార్శనికుడు సీఎం చంద్రబాబు.’ అని అన్నారు.