ప్రియురాలిని గంజాయి తాగమని హింసించిన యువకుడు.. చంపేసిన అన్న!

562చూసినవారు
ప్రియురాలిని గంజాయి తాగమని హింసించిన యువకుడు.. చంపేసిన అన్న!
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. గుడిమెళ్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి, మలికిపురానికి చెందిన పడమటి నోయల్ జార్జి (19) ప్రేమించుకుంటున్నారు. నోయల్ గంజాయికి బానిసయ్యడు. దాంతో ప్రశాంతిని కూడా గంజాయి తాగమని వేధించేవాడు. ఈ విషయాన్ని ప్రశాంతి తన అన్న రాపాక ప్రకాష్‌కు చెప్పింది. దాంతో ప్లాన్ ప్రకారం నోయల్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపి గోదావరిలో మృతదేహాన్ని పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్