వైసీపీ పాలనను విమర్శించాననే 2021లో తన హత్యకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తన పుట్టిన రోజు నాడే అంతమొందించేందుకు ప్రయత్నించారని చెప్పారు. తనపై హత్యాయత్నం చేసిన వారందరికీ శిక్ష పడాలని ఆయన కోరారు. కూటమి అధికారంలోకి రాకపోయుంటే తనను ఇప్పటికే చంపేసేవారని చెప్పారు.