మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు సేవా కేంద్రంలో గురువారం కౌలు రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌలు రైతుల కార్డుల ద్వారా జరిగే ఉపయోగాలను స్థానిక రైతులకు వివరించారు. ఈ కార్డులు ఉంటే పంట నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.