ఘనంగా వినాయక స్వామి చతుర్థి వేడుకలు

80చూసినవారు
ఘనంగా వినాయక స్వామి చతుర్థి వేడుకలు
మర్రిపాడు మండలం డీసిపల్లి శ్రీ పంచముఖ శక్తి గణపతి దేవస్థానంలో మంగళవారం అంగారక సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, విశేష పూజ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గజమాలలు, గరిక మాలలు, ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్