చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దంపతులు శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.