చంద్రగిరి: రెవెన్యూ సదస్సులో ఆందోళన చేపట్టిన గ్రామస్థులు

52చూసినవారు
రామచంద్రాపురం మండలం రేకలచేనులో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆందోళన చోటుచేసుకుంది. హిందూ దేవాలయాలపై కక్ష సాధింపు ఎందుకని రెవెన్యూ సదస్సులో అధికారులను గ్రామస్థులు నిలదీశారు. గ్రామంలోని శివాలయం శిథిలావస్థకు చేరడంతో పక్కనే నూతన ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. భూ కబ్జాకు పాల్పడుతున్నారని కొందరు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో దాతలపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్