తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో నేడు (శుక్రవారం)వరలక్ష్మి వ్రతం ఘనంగా జరగనుంది. ఆలయాన్ని, వ్రత మండపాన్ని సుందరంగా పుష్పాలు, పండ్లతో అలంకరించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మి వ్రతాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు టీటీడీ గురువారం తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన సేవా టిక్కెట్లు కలిగిన భక్తులు నేరుగా హాజరుకానున్నారు.