చిత్తూరు నగరంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ 16 మంది వాహనదారులకు భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు శనివారం తెలిపారు. ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున రూ. 1. 60 లక్షలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించినట్లు తెలిపారుమొదటిసారి పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, 2వ సారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందన్నారు.