చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు చేతుల మీదుగా పెనుమూరు కానిస్టేబుల్ రఘురాం శనివారం ప్రశంసా పత్రం అందుకున్నారు. కర్ణాటకలో జరిగిన ఓ దొంగతనం కేసులో రఘురాం కీలకంగా వ్యవహరించారు. 90 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు గాను కర్ణాటక పోలీసులు ఇతనికి ప్రశంసా పత్రంతో పాటు, షీల్డ్ పంపించారు. ఇంతముందు రఘురాం పలు కేసుల్లో ప్రతిభ చూపి అనేక అవార్డులు అందుకున్నారు.