రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత చిత్తూరులో శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్బంగా మంత్రికి చిత్తూరు ఎమ్మెల్యే, కూటమి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.