బంగారునగలు దొంగతనం చేసిన ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య శనివారం తెలిపారు. 26న కాజూరు వద్ద యాదమరి ఎర్రచేనుకు చెందిన జ్ఞానమ్మ ఆటోలో బంగారు నగల సంచితో ఎక్కింది. ఇదే ఆటోలో మరో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు కూడా ప్రయాణించారు. కమ్మరాయని మిట్ట వద్ద వారు బాధితురాలిని ఏమార్చి బంగారు నగలను అపహరించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఓబనపల్లి వద్ద నిందితులను అరెస్టు చేశారు.