శ్రీ రంగరాజపురం మండల కేంద్రంలో వెలిసిన ద్రౌపతి ధర్మరాజుల దేవస్థానం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఆదివారం టిడిపి మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో దుర్యోధన వధ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగ మడుగులో తరుచుకున్న దుర్యోధనుడిని భీమసేనుడు తీసుకు వచ్చిన యుద్ధ సన్నివేశం ప్రజలను ఆకట్టుకున్నాయి. దుర్యోధనుడు శోకసముద్రంతో పద్యాలను ఆలపించడంతో ప్రజలు కన్నీటి పర్వతమయ్యారు.