గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే థామస్ ఆదివారం పర్యటిస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం మొగిలి ఘాట్ ప్రమాదంలో మృతి చెందిన జంగాలపల్లి గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చెక్కును అందజేస్తారని. అదేవిధంగా ఉదయం 10 గంటలకు నెల్లికాయ గుట్టలో గృహాలు కాలిపోయిన బాధితులను పరామర్శిస్తారని తెలిపారు.